ఎఫ్.డి.ఐల దోపిడీ, భారతీయ పాలకులు మేధావుల సహకారం

మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే. నికర ఎఫ్.డి.ఐలు ఇలా పెద్ద మొత్తంలో తగ్గిపోవడానికి ప్రధాన కారణం విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో తమ లాభాలను తరలించుకు వెళ్ళడమే అని ఆర్.బి.ఐ తెలియజేసింది. దానితో పాటు భారత పెట్టుబడిదారులు సైతం గణనీయ మొత్తంలో దేశం లోని వారి పెట్టుబడిని విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు తరలించుకుపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

అంటే అగ్నికి వాయువు తోడైంది అన్న మాట! కాదు కాదు, ఇప్పుడు మనల్ని పాలిస్తున్నది ఆర్.ఎస్.ఎస్-బి.జే.పి నేతృత్వం లోని హిందూత్వ ప్రభుత్వం కనుక అగ్ని దేవుడికి వాయు దేవుడు తోడై భారత దేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయేలా ఆశీర్వదించారు (శపించారు అనాలేమో!?).

ఆర్.బి.ఐ గణాంకాల ప్రకారం FY 2024లో దేశం లోకి వచ్చిన ఎఫ్.డి.ఐ ల మొత్తం (గ్రాస్) 70.9 బిలియన్ డాలర్లు కాగా, డివిడెండ్లు (లాభాలు), భారత కంపెనీల షేర్ల అమ్మకాలు లేదా పెట్టుబడుల ఉపసంహరణ మొ.న కార్యకలాపాల ద్వారా విదేశీ బహుళజాతి సంస్థలు మరియు వివిధ సంస్థాగత పెట్టుబడులు 44.4 బిలియన్ డాలర్లు తరలించుకుపోయారు.

ఇక భారత బడా పెట్టుబడిదారులు విదేశాలకు మదుపు (investment) నిమిత్తం 15.96 బిలియన్ డాలర్లు పట్టుకుపోయారు. వెరసి మొత్తం 60.36 బిలియన్ డాలర్లు దేశం నుండి తరలించ బడ్డాయి. ఆ విధంగా దేశం లోకి వచ్చిన నికర ఎఫ్.డి.ఐ లు (70.9 – 60.36) 10.54 బిలియన్ డాలర్లుగా తేలింది.

2007 తర్వాత ఇంత తక్కువగా ఎఫ్.డి.ఐ ల రాబడి ఉండడం ఇదే మొదటిసారి. 2007-08 సంవత్సరంలో “ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం” సంభవించడం వల్ల దేశం నుండి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ప్రధానంగా అమెరికా సావరిన్ బాండ్ల లోకి వెళ్ళిపోయింది. తీవ్ర మాంద్యం, ఆర్ధిక సంక్షోభం ఏర్పడ్డ సందర్భాల్లో పెట్టుబడులన్నీ అమెరికా ట్రెజరీస్ (అమెరికా సావరిన్ బాండ్లు) లోకి వెళ్ళడం పరిపాటి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత భద్రమైన చోటు అమెరికా ట్రెజరీస్ మాత్రమే అని పెట్టుబడులకు గాఢ నమ్మకం.

కాని ఇప్పుడు అలాంటి సంక్షోభం ఏమీ ఏర్పడలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇలా పెట్టుబడులు ఎగిరిపోవడానికి కారణంగా చెబితే అది నమ్మదగ్గ విషయం కాదు. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై గత మార్చి నాటికి రెండు సం.ల ఒక నెల అయ్యింది. గాజాపై ఇజ్రాయెల్ దమనకాండ, హత్యాకాండ మొదలై కూడా 8 నెలలు దాటింది. కనుక ఈ యుద్ధాలను పెట్టుబడులు ఎగిరిపోవటానికి సాకుగా చూపలేరు.

ఎఫ్.డి.ఐ లు దేశం దాటిపోవడం గురించి ఇంతగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే మన ప్రధాని మోడీ (జరిగిన ఎన్నికల్లో ఎన్.డి.ఏ ప్రభుత్వమే ఏర్పడనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి గనుక నరేంద్ర మోడీ గారిని ఇంకా ప్రధాన మంత్రి గానే సంబోధించడం జరుగుతోంది) తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఎఫ్.డి.ఐ లు పెద్ద మొత్తంలో దేశంలోకి రావడం ఒకటిగా ఎప్పుడూ చెబుతుంటారు గనుక! మన నేతలు చెబుతున్నది నిజామా కాదా అన్నది మనం చెక్ చేసుకోవాలి కదా!

గత పోస్ట్ / ఆర్టికల్ లో 2021, 2022, 2023 ఆర్ధిక సంవత్సరాలలో మొత్తం 109 బిలియన్ డాలర్లు దేశం నుండి తరలిపోయాయని చెప్పుకున్నాం. ఈ 2024 ని కూడా కలిపితే గత నాలుగేళ్ళలో 169.36 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం తరలిపోయాయన్నమాట! ఇది దాదాపు రు 14.06 లక్షల కోట్లకు సమానం. దీనిని ఒక సందర్భంలో (context) పెట్టి చూస్తే ఈ మొత్తం భారత దేశపు గత వార్షిక బడ్జెట్ (రు 45,03,097 లక్షల కోట్లు) అంచనా లో దాదాపు మూడవ వంతుకు సమానం. ఇదేమీ చిన్నా చితకా మొత్తం కాదు. విదేశీ పెట్టుబడులు తమ లాభాల కింద భారత దేశం నుండి ఎంత పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని తరలించుకుపోతున్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

కనుక ఎఫ్.డి.ఐలు, ఎఫ్.ఐ.ఐలు, ఎఫ్.పి.ఐ లు పేరు ఏదైనా (ఏ రాయైతేనేం పళ్ళు ఊడగొట్టు కునేందుకు?) మనకు/భారత జనానికి ఒరగబెడుతున్నది ఏమీ లేదని అర్ధం అవుతోంది. ఎఫ్.డి.ఐ లు వస్తూ వస్తూ ఆధునిక టెక్నాలజీని తెస్తాయనీ తద్వారా దేశానికి ఆధినిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వస్తుందనీ కేంద్రం చెప్పే మాటల్లో వాస్తవం లేనే లేదు.

అమెరికా, ఐరోపా దేశాలలో ఏ దేశమూ ఇంతవరకు మనకు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిన ఉదాహరణ లేదు. పైగా ఆ దేశాలు ఇవ్వకపోగా ఇచ్చే దేశాలను కూడా ఇవ్వకుండా అడ్డుకుంటాయి. రష్యాకు ఎల్టిసిన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇండియాకు క్రయోజనిక్ ఇంధన టెక్నాలజీ ఇవ్వడానికి రష్యా సిద్ధ పడింది.

అప్పట్లో ఎల్టిసిన్ అమెరికా అదుపాజ్ఞల్లో ఉన్నాడు. ఇప్పటి పుతిన్ నాయకత్వం లోని రష్యా వలే అప్పటి రష్యా అమెరికాకు ఎదురు చెప్పే స్థితిలో లేదు. అమెరికా అభ్యంతరం చెప్పడంతో క్రయోజనిక్ పరిజ్ఞానం ఇవ్వడంలో రష్యా వెనక్కి తగ్గింది. దానితో అధిక పే లోడ్ తో కూడిన ఉపగ్రహ ప్రయోగాలలో భారత దేశం ఒక దశాబ్దం వెనకబడి పోయింది. పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞానం అందజేత అలా ఏడ్చింది మరి! అయినా సరే మన పాలకులు జనానికి కాకమ్మ కబుర్లు చెప్పడం మానలేదు.

అధిక లాభాల రంగాల్లోకే ఎఫ్.డి.ఐ ల ప్రవేశం

ఇంతకీ దేశం లోకి వచ్చే ఎఫ్.డి.ఐ లు ఏయే రంగాలకు ప్రధానంగా వెళ్తున్నాయి? ఆర్.బి.ఐ వెలువరించిన ‘ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులు’ (స్టేట్ ఆఫ్ ఎకానమీ) నివేదిక ప్రకారం ఎఫ్.డి.ఐ ఈక్విటీ పెట్టుబడుల్లో 60 శాతం మాన్యుఫాక్చరింగ్, విద్యుత్ మరియు ఇతర ఇంధన రంగాలు, కంప్యూటర్ సేవలు, రిటైల్ మరియు హోల్ సేల్ రంగాల లోకి వస్తోంది.

విద్యుత్ యూనిట్ ధరలు నానాటికి పెరగడం మనం అనుభవిస్తున్నాం. ఇంధనం (పెట్రోలు, డీజిల్, కిరోసిన్, పెట్రోలియం శుద్ధి మొ.నవి) ధరలు మోడీ హయాంలో లీటర్ పెట్రోలు రు 70 (2013) నుండి ఏకంగా రు 70 నుండి రు 120 కీ, లీటర్ డీజిల్ ధర రు 52 నుండి రు. 93 కీ పెరిగిపోయింది. అంటే ఇండియాలో ఇంధన శుద్ధి, సరఫరా కంపెనీల్లో భారీ లాభాలు వచ్చేందుకు భారత ప్రభుత్వం మార్గం వేసింది.

అందుకే విద్యుత్, ఇంధన రంగాల్లో విదేశీ పెట్టుబడులు రావడం జరుగుతోంది. అంటే మనం విద్యుత్ కీ, పెట్రోల్, డీజిల్ లకీ చెల్లిస్తున్న అత్యధిక ధరల ద్వారా విదేశీ పెట్టుబడి బాగా లబ్ది పొందుతోంది. అంబానీ సోదరులు, అదానీ లకు చెందిన కంపెనీలు విద్యుత్, ఇంధన రంగాలలో గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. వీళ్ళ కంపెనీల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అత్యధిక లాభాలను ఎఫ్.డి.ఐ లు భారత దేశం నుండి తరలించుకు పోతున్నాయని దీన్ని బట్టి గ్రహించాలి. అనగా అదాని, అంబానీ తదితర స్వదేశీ పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడులకు భారతీయ ముఖంగా అవతారం ఎత్తారు తప్ప వారివి గా చెప్పే కంపెనీలలో వారి పెట్టుబడి కంటే విదేశీ పెట్టుబడుల వాటాయే ఆధిక్యంలో ఉంటోందని అర్ధం అవుతోంది.

ఇక కంప్యూటర్ సేవలు చూస్తే మనవిగా చెప్పే కంపెనీలు వేళ్ళ మీద (ఇన్ఫోసిస్, విప్రో, TCS, HCL, టెక్ మహీంద్ర) లెక్క పెట్టవచ్చు. ఇంకా ఓ డెబ్భై ఎనభై వరకూ చిన్నా, చితకా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ కంపెనీలు ఉన్నాయి గాని అవి మళ్ళీ అమెరికా, ఐరోపాలలోని కంప్యూటర్ MNC ల పైనే ఆధారపడి ఉంటాయి. బడా MNC లు ఈ చిన్న కంపెనీలకు సాఫ్ట్ వేర్ తయారీ కాంట్రాక్టు లు ఇవ్వొచ్చు. దానితో పాటు ఈ చిన్న కంపెనీలు తమ ఐడియాని పశ్చిమ ఫైనాన్స్ కంపెనీల ముందు ప్రదర్శిస్తే వాళ్ళు పెట్టుబడిని సమకూర్చ వచ్చు.

ఇండియాకు చెందిన బడా సాఫ్ట్ వేర్ కంపెనీలకైతే అమెరికా, ఐరోపా దేశాలే ప్రధాన మార్కెట్! మన కంప్యూటర్ మేతావులు రేయింబవళ్ళు కష్టపడి ఒళ్ళు హూనం చేసుకుంటూ, చట్ట బద్ధ మైన పని గంటలు అనే పరిమితి లేకుండా పని చేస్తూ ఉంటే వారి కష్ట ఫలితాన్ని విదేశీ సాఫ్ట్ వేర్ కంపెనీలు అత్యంత కారు చౌకగా వినియోగించుకుంటున్నాయి. క్యాప్ జెమిని, జనరల్ ఎలక్ట్రిక్ ఫైనాన్స్ లాంటి బడా గుత్త ఫైనాన్స్ కంపెనీలు భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు తామే స్వయంగా కూడా ఇండియాలో షాపులు తెరుస్తున్నాయి.

షాపులు అంటే రోడ్డు పక్క షాపులు కాదు, ఆకాశ హర్మ్యాలలో భారత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కళ్ళూ, మెదడూ, చేతి వేళ్ళు కంప్యూటర్లకు అప్పజెప్పి రోజుకు కనీసం 12 గంటల పాటు పని చేసే బడా కంపెనీలు. ఈ కంపెనీలు తమ తమ దేశాలలోని గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వార్షిక ప్యాకేజీలలో కేవలం 50 వ వంతు నుండి 10 వ వంతు వరకు ఉండే వార్షిక ప్యాకేజీలతో భారతీయుల చేత పని చేయిస్తారు. ఆ విధంగా పదుల రెట్లు లాభాలను తరలించుకు పోతున్నారు.

మరో కోణంలో ఇండియన్ సి.ఇ.ఓ ల పరిస్ధితి కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకి గూగుల్ సి.ఇ.ఓ సుందర్ పిచాయ్ 2021లో వార్షిక వేతనం, బోనస్ లు $6 మిలియన్లు కాగా 2022లో $7.4 మిలియన్లు. అదే కాగ్నిజెంట్ సి.ఇ.ఓ 2022లో 108.282 మిలియన్ డాలర్లు వార్షిక సంపాదన పొందాడు. ఇందులో వేతనం భాగం $950,000 కాగా బోనస్ కింద $3.613 మిలియన్లు, స్టాక్ ఆప్షన్స్ కింద $103.7 మిలియన్లు పొందాడు. సత్య నాదెళ్ళ (మైక్రో సాఫ్ట్ సి.ఇ.ఓ) కాస్త మెరుగ్గా 2020లో $84 మిలియన్లు పొందాడు. ఒరాకిల్ సి.ఇ.ఓ సఫ్రా కాట్జ్ 2022లో $138.2 మిలియన్ వేతనం పొందింది. (1 మిలియన్ డాలర్ = రు 8.3 కోట్లు).

ఉన్నత స్థాయిల్లో పని చేసే కొందరు భారతీయ మేధావులు కొందరు పశ్చిమ దేశాల సి.ఇ.ఓ లకు సమానంగా పొందే ఉదాహరణలు లేకపోలేదు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి పశ్చిమ దేశాలకు వెళుతున్న భారతీయ ఇంజనీర్లు, డాక్టర్లు, మేనేజర్లు అంతా భారతీయుల శ్రమతో నిర్మించిన యూనివర్సిటీలలో, ల్యాబ్ లలో, భారీ ఇంజనీరింగ్ పరికరాలతో విద్యా బుద్ధులు నేర్చుకున్నారు తప్ప వారి చదువుకు పశ్చిమ దేశాలు ఎమీ ఇవ్వలేదు. అమెరికాలో MS చేసిన వారు కొందరు ఉండవచ్చు గాక! కాని ఆ MS కి పునాది ఇండియన్ల శ్రామికులు, ఉపాధ్యాయులు అందజేశారు. వారి సేవలు భారత దేశానికి అందవలసి ఉండగా విదేశాలకు చౌకగా తమ సేవలను అమ్ముకుంటూ శ్వేతజాతి దురహంకారాన్ని సైతం సహిస్తున్నారు.

ఇండియాలో సౌకర్యాలు, అవకాశాలు లేవు అని వీరి వాదన చేయవచ్చు. సరే, మీకు చదువు ఉంది కాబట్టి విదేశాలకు అవకాశాల కోసం వెళ్తున్నారు. కానీ మీ చదువు కోసం యూనివర్సిటీలు, కాలేజీలు, ల్యాబ్ లు, మిషనరీలు నిర్మించి తయారు చేసి మీ ఉన్నతి కోసం శ్రమను కొద్ది వేతనాల కోసం ధారపోసిన భారతీయ శ్రామికుల గురించి వీళ్ళు ఆలోచించ వలసిన అవసరం లేదా అని వీరు ప్రశ్నించుకోవాలి. వీళ్ళను ఎలాగూ అమెరికా, ఐరోపాలకు రానివ్వరు.

అయినా సరే ఆఫ్రికా, ఆసియాల నుండి మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో అవకాశాల కోసం లక్షల మంది పేదలు ఐరోపా తీరాలకు, అమెరికా-మెక్సికో సరిహద్దులకు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. వారిలో అనేక మంది గుట్టలు గుట్టలుగా సముద్రాలలో మునిగిపోతున్నారు. ఎలాగో సరిహద్దు దాటినవారు అనేక అనచివేతలకు, దూషణ తిరస్కారాలకు గురవుతూ ‘దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు’ పని చేస్తున్నారు. వారి శ్రమతో విద్యా బుద్ధులు నేర్చి విదేశీ పెట్టుబడికి శ్రమను అమ్ముకుంటున్న బుద్ధి జీవులు ఈ వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంది.

ఎఫ్.బి.ఐ నికర పెట్టుబడి తగ్గిపోవడం దగ్గర మొదలు పెట్టి, ఈ పెట్టుబడులు ఏయే రంగాలకు వెళ్తున్నాయో పరిశీలించి, ఆ రంగాలకే ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నించుకుని, అధిక లాభాల కోసమే అని గ్రహించి, దాని వల్ల దేశానికి జరుగుతున్న నష్టం గురించి చర్చించుకుని, చివరికి ఇండియన్ బ్రెయిన్ డ్రెయిన్ (మేధో వలస) వద్దకు చేరి, ఈ భారతీయ మేధావులు తమ మాతృదేశంలో తమ వృద్ధికి సహకరించిన శ్రామికుల పట్ల గల బాధ్యతను మర్చిపోయారు అని చూశాం.

అనగా ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ ఇత్యాది విదేశీ పెట్టుబడులకూ భారత దేశంలోని వంద కోట్లకు పైగా గల కార్మిక, మధ్య తరగతి శ్రమ జీవుల ఆకలి బాధలకు, అత్యంత తక్కువ సంపాదనలకు, వారి విద్యా లేమికి, మధ్య సంబంధాన్ని చూశాం. ఈ క్రమానికి భారత పాలకులే WTO ఒప్పందాల ద్వారా, వరల్డ్ బ్యాంక్, ఐ.ఎం.ఎఫ్ షరతులకు అంగీకరించి అప్పులు తీసుకోవడం ద్వారా, విదేశీ దోపిడీకి అనుగుణంగా సకల నియంత్రణ వ్యవస్థలను ప్రభుత్వాలు ఎత్తివేయడం ద్వారా సంపూర్ణంగా, ఎలాంటి శషభిషలు లేకుండా సహకరిస్తున్నారని అర్ధం అవుతున్నది. ఇందులో ఎన్.డి.ఏ, యు.పి.ఏ ప్రభుత్వాల మధ్య ఎలాంటి తేడా లేదు. అసలు ఈ విదేశీ దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వమే వివిధ చట్టాలు చేసి, ఒప్పందాలపై సంతకాలు చేసి, గేట్లు బార్లా తెరిచింది. ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ విధానాలను తిడుతూనే మరింత వేగంగా అదే కాంగ్రెస్ విధానాలను అమలు చేస్తూ భారత అశేష ప్రజానీకాన్ని నిలువునా మోసగిస్తున్నారు.

ఈ నిరంతరాయ దోపిడీకి చరమ గీతం పాడవలసిన పాత్రను త్యజించి మెరుగైన అవకాశాల కోసం అనే పేరుతో విదేశీ కంపెనీలకు ఊడిగం చేసేందుకు సిద్ధపడ్డామన్న సంగతిని విదేశాల్లోని భారతీయులు గ్రహించాలి. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎటువంటి స్వార్ధం లేకుండా, అవకాశాల కోసం అర్రులు చాచకుండా భారత జనుల దాస్య శృంఖలాలను తెంచడానికి ప్రాణాలను తృణప్రాయంగా బ్రిటిష్ కరకు తుపాకుల ముందు, ఉరి కొయ్యలపైనా, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో, అండమాన్ జైళ్ళల్లో అర్పించిన అమర వీరులు త్యాగాలు చేసి ఉండకపోతే ఈ నాటి కంప్యూటర్ మేధో బుద్ధి జీవులకు ఇలా అమెరికా, ఐరోపా దేశాలకు డాలర్ల కోసం చేసిన ప్రయాణాలలో చోటు దక్కి ఉండేదా అని వీరు ప్రస్నించుకోవాలి.

డాలర్లు: ఇండియాకి వచ్చేదాని కంటే పోయేది రెట్టింపు

ప్రభుత్వాలు ఈ రకంగా ఉంటే భారత కార్పోరేట్ కంపెనీలు సైతం విదేశీ ఇన్వెస్ట్^మెంట్ బ్యాంకుల నుండి అప్పుల కోసం వెంపర్లాడుతూ ఉంటాయి. అంబాని, అదాని మొదలు కొని ఆంద్ర ప్రదేశ్ లోని జిఎంఆర్ వరకూ ఇలా వాల్ స్ట్రీట్, లండన్ లలోని ఫైనాన్స్ కంపెనీల నుండి అప్పుల కోసం దేబిరించే వాళ్ళే. అప్పు ఇవ్వడానికి లండన్ లేదా వాల్ స్ట్రీట్ కంపెనీ అంగీకరిస్తే దానిని ఒక పెద్ద విజయంగా మన పెట్టుబడిదారులు సగర్వంగా ప్రకటించుకుంటాయి కూడా. వారి పాటకి ప్రభుత్వాలు తందానా అంటుంటాయి.

ఇలా భారత దేశానికి వచ్చే పెట్టుబడుల్లో “ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు” ఒక రకం. ఇవి ఎఫ్.ఐ.ఐ లలో భాగం. ఎఫ్.ఐ.ఐ అంటే Foreign Institutional Investments లేదా విదేశీ సంస్థాగత పెట్టుబడులు అని అర్ధం. వీటిని ఒక్కోసారి ఎఫ్.పి.ఐ (Foreign Portfolio Investments) లు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఎఫ్.ఐ.ఐ లు ఎఫ్.పి.ఐ లలో ఒక భాగం. ఈ చర్చ మరోసారి చూద్దాం.

ఆర్.బి.ఐ ప్రకటించే బ్యాలన్స్ షీట్ లో “ఈక్విటీ మరియు పెట్టుబడి నిధుల షేర్లపై ఆదాయం” (Income on equity and investment fund shares) అన్న హెడ్/ఖాతా కింద మనకు ఈ వివరం కనిపిస్తుంది. విదెశీ బహుళజాతి సంస్థల (MNC) లాభాలు మొ.న వంటి వాటి ద్వారా వచ్చిన ఆదాయాల తరలింపు ఈ ఖాతా ద్వారా చూపిస్తారు. ఇలా ఇండియా నుండి విదేశీ కంపెనీలు లాభాలు తీసుకెళ్ళాలంటే డాలర్లలోనే తీసుకెళ్తాయి తప్ప రూపాయిలలో తీసుకెళ్లవు. రూపాయి అంటే వాటికి ఎర్ర ఏగాని కింద కూడా పనికిరాదు మరి!

మార్చి 2023తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తరలించుకెళ్ళిన 40 బిలియన్ డాలర్లు రికార్డు మొత్తం అని ఎకనమిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఎందుకంటే మార్చి 2021 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇలా విదేశీ కపెనీలు ఇండియా నుండి మోసుకు పోయిన లాభాలు 33 బిలియన్ డాలర్లు కాగా, మార్చి 2022తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో తీసుకెళ్ళిన లాభాలు 36 బిలియన్ డాలర్లు.

అంటే మార్చి 2020 కోవిడ్ వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తర్వాత మూడు సంవత్సరాలలో విదేశీ కంపెనీలు అక్షరాలా 109 బిలియన్ డాలర్లు లేదా రు. 9.047 లక్షల కోట్లు తమ పెట్టుబడులకు లాభాలుగా డాలర్ల రూపంలో పట్టుకుపోయాయి. ఇలా విదేశీ కంపెనీలు డాలర్ల లాభాలు తీసుకెళ్ళినప్పుడల్లా భారత దేశ విదేశీమారక ద్రవ్య నిల్వలు ఆ మేరకు తగ్గిపోతూ ఉంటాయి. కేంద్రం అప్పులు తెచ్చి ఆ లోటు పూడ్చుతూ ఉంటుంది.

నిజానికి మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం రుణాల ద్వారా సమకూర్చుకున్నవే. సెప్టెంబర్ 8, 2023 నాటికి ఇండియా వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 598.89 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇందులో బంగారం నిల్వలు 44.939 బిలియన్లు కాగా ఐ.ఎం.ఎఫ్ వద్ద ఉండే ఎస్.డి.ఆర్ (స్పెషల్ డ్రాయింగ్ రైట్స్) లు 18.195 బిలియన్లు. మిగిలినవి డాలర్, యూరో, యెన్ లతో కూడిన నిల్వలు.

కోవిడ్ వల్ల భయంతో తమ పెట్టుబడులు కాపాడుకునేందుకు తమ లాభాల్ని విదేశీ బహుళజాతి కంపెనీలు తలించాయి తప్ప మరో కారణం ఇందులో లేదు అని కొందరు అపాలజిస్టులు చెప్పబోతారు. కాని అది అవాస్తవం. అదే నిజం అయితే 1995 ప్రాంతంలో ఆసియా టైగర్ దేశాల్లో జరిగినట్లు లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎగిరిపోవాల్సి ఉంది. అలా జరగలేదు కదా!

కాబట్టి ఎఫ్.డి.ఐ/ఎఫ్.ఐ.ఐ/ఎఫ్.పి.ఐ పేరు ఏదైనా సరే విదెశీ బహుళజాతి ఫైనాన్స్ కంపెనీలు, ఇతర సంస్థాగత పెట్టుబడులు కేవలం లాభాల కోసమే ఇక్కడికి వస్తాయి తప్ప భారత దేశాన్ని, భారత జనాన్ని ఉద్ధరించడానికి కాదు. కాని మన పాలకులు ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ, ఎఫ్.పి.ఐ ల కోసం దేబిరిస్తూ ఉంటాయి. వాటి రాక కోసం దేశ ఆర్ధిక వ్యవస్థ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థలను, రెగ్యులేటరీ వ్యవస్థలను పార్లమెంటులో చట్టాలు చేసి మరీ రద్దు చేసి మాయం చేసేశారు. మన్మోహన్ హయాంలో మొదలైన ఈ తతంగం మోడీ హయాంలో కొత్త పుంతలు తొక్కుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉంది అంటే వారిని ఎన్నుకున్నది భారత ప్రజలు కాదు. విదేశీ కంపెనీలు, విదేశీ రాయబారులు, వాల్ స్ట్రీట్, లండన్, ఫ్రాంక్ ఫర్ట్, ప్యారిస్ తదితర ఫైనాన్స్ కంపెనీల సి.ఇ.ఓ లు ఏరి కోరి వారిని నియమించుకున్నట్లుగా ఉన్నది. యు.పి.ఏ హయాంలో ఈ ప్రక్రియ కాస్త మెల్లగా జరిగితే ఎన్.డి.ఏ హయాంలో ప్రభుత్వ సో కాల్డ్ సంస్కరణల వేగం ఉసేన్ బోల్ట్ స్థాపించిన రికార్డులను తిరగ రాస్తోంది.

మనలో మన మాట! అసలు పెట్టుబడి అనేది లాభం కోసం కాకుండా దీన జనోద్ధారణ కోసం పనిచేస్తుందటండీ, మరీ విడ్డూరం కాకపొతేనూ! మన పాలకులు చెప్పే కాకమ్మ కబుర్లని నెత్తిన పెట్టుకుని ఊరేగే మన మేతావుల కత ఇంకా విడ్డూరం!

వడ్డీలో మార్పు లేదు, జీడీపీ అంచనా తగ్గింపు

 

RBI జెల్ల కొట్టింది. వడ్డీ రేటు తగ్గింపు కోసం బడా కంపెనీలు, బడా బాబులు ఆశగా ఎదురు చూస్తుంటే వారి ఆశల్ని వమ్ము చేసింది. వడ్డీ రేట్లలో మార్పులు లేవు పొమ్మంది. పైగా 2016-17 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు విషయమై గతంలో వేసిన అంచనాను తగ్గించేసుకుంది. వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం రేపో రేటు (స్వల్ప కాలిక వడ్డీ రేటు – దీనినే క్లుప్తంగా బ్యాంకు రేటు / వడ్డీ రేటు అంటారు) 6.25% గా ఉంది. దీనిని 6%కి తగ్గిస్తారని కొన్ని సంస్ధలు అంచనా వేస్తె మరి కొందరు 5.75% కి తగ్గిస్తారని అంచనా వేశారు. ఎవరి అంచనా కూడా నిజం కాలేదు. 

వీరి అసలు, అంచనాకు ప్రధాన కారణం బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున డిపాజిట్లు ఉండడం (12.6 లక్షల కోట్లు జమ అయినట్లు బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ చెప్పింది. 11.55 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు   ఈ రోజు RBI తన సమీక్షా ప్రకటనలో పేర్కొంది.) డబ్బు చలామణి తగ్గిపోవడం, కనుక ధరలు తగ్గడం. 

వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించడానికి RBI చెప్పిన కారణాలు: అమెరికా ఎన్నికల అనంతరం ప్రపంచంలో నెలకొన్న పరిస్ధితులు; ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితులు; రెండో క్వార్టర్ లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడం. 

భారత బ్యాంకుల్లో భారీగా ద్రవ్య నిల్వలు చేరినప్పటికీ “ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితుల”ను వడ్డీ రేటు తగ్గించకపోవడానికి కారణాల్లో ఒకటిగా చెప్పడం అంటే ఏమిటి అర్ధం? వడ్డీ రేట్లు తగ్గుతాయని, తేలికగా రుణాలు అందుబాటులోకి వస్తాయని, పెట్టుబడులు వృద్ధి అవుతాయని, కొత్త ఉద్యోగాలు వఛ్చి ఉపాధి పెరుగుతుందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పిన మాటలు నిజాలు కావా? 

డీమానిటైజేషన్ వలన జీడీపీ పెద్దగా ఏమి పడిపోదని, మహా అయితే 0.2 తగ్గుతుందని ఇదేమంత విషయం కాదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఛానెళ్ల  చర్చల్లో బీజేపీ ప్రతినిధులు కూడా ఇదే చెప్పారు. అయితే జీడీపీ వృద్ధి రేటు ముందు అనుకున్నట్లు 7.6 % కాకుండా  7.1 శాతంగా నమోదు అవుతుందని సమీక్షా ప్రకటనలో RBI తెలిపింది. ఈ తగ్గుదలకు డీమానిటైజేషన్ కారణం అని కూడా చెప్పింది. ఇక్కడ కూడా బీజేపీ నేతల లెక్క తప్పింది.        

“వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని RBI ప్రకటించింది. అనగా RBI నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం చొరబడిందని చెప్పవచ్చని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

“దొంగ నోట్లు, నల్ల డబ్బు, టెర్రరిజం ఫైనాన్సింగ్ లను అరికట్టేందుకుకే డీమానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు” అని RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఇది వింత ప్రకటన. RBI గవర్నర్ చెప్పవలసింది తాము చేపట్టిన డీమానిటైజేషన్ చర్యకు కారణాలు ఏమిటన్నది గాని ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కాదు. జనం ఏమి అనుకుంటున్నారో జనానికి చెప్పాల్సిన బాధ్యత RBI గవర్నర్ కి ఎవరు అప్పజెప్పారు? 

ఆయన బ్యూరోక్రాట్ అధికారి. చట్టబద్ధంగా ఆయన కొన్ని విధులు నిర్వర్తించాలి. అంతవరకే ఆయన ప్రకటన పరిమితం కావాలి. జనం మదిలోని భావాలను కనిపెట్టి ద్రవ్య సమీక్షా విధానంలో ప్రకటించటం ఆయన విధి కాదు. అయినా ఆయన జనం గురించి చెప్పారంటే అది రాజకీయ నాయకులు ప్రేరేపించిన ప్రకటనను విడుదల చేశారని అర్ధం అవుతున్నది.    

రాజకీయ నాయకులు లేదా కేంద్ర ప్రభుత్వమూ మరియు మంత్రులు RBI విధుల్లోకి చొరబడి ఆ సంస్ధ ప్రకటనలను కూడా ప్రభావితం చేయడం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎంతమాత్రం మంచిది కాదు. ప్రజలకు అసలే మంచిది కాదు. 

 

సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది.

రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది.

గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ను బ్యాలన్స్ షీట్ లో చూపించకుండా దాచి పెట్టే వెసులుబాటు ఉండేది. దానివల్ల మొండి బాకీలను బ్యాలన్స్ షీట్ లో చూపేవారు కాదు. ఫలితంగా బ్యాంకు బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తోందని చూపించేవారు. మొండి బాకీ కాస్తో కూస్తో వసూలైతే అప్పుడే లాభంగా పుస్తకంలో చూపేవారు.

ఈ వెసులుబాటు రుణాల ఎగవేతదారులకు గొప్ప వరం అయింది. (అసలు వాళ్ళకు వరం ఇవ్వడం కోసమే బాకీలు దాచిపెట్టే దారుణాన్ని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.) పుస్తకాలలో కనపడని బాకీలు వసూలు చేయాలన్న ధ్యాసే ఉండేది కాదు. పొరబాటున వసూలు అయినవి పోగా మిగిలిన మొండి బాకీలను కొన్నేళ్ళ తర్వాత రద్దు చేసేసేవాళ్ళు. అప్పు రద్దు చేస్తే బాకీదారులకు వరమే కదా!

రఘురాం రాజన్ ఈ వెసులుబాటు లేకుండా చేశారు. ఎన్‌పి‌ఏ లు అన్నింటినీ పుస్తకాల్లో చూపాల్సిందే అని నిబంధన విధించారు. దానితో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. భారత బ్యాంకుల సంక్షోభం గురించి పశ్చిమ పత్రికలు కూడా మాట్లాడటం మొదలెట్టాయి.

రఘురాం రాజన్ చర్య ఫలితాన్ని తెలుసుకోవాలంటే ఒక అంశాన్ని చూడొచ్చు. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి బాకీలు 4.6 శాతం ఉండేవి. కొత్త నిబంధన విధించాక అది ఈ యేడు జూన్ నాటికి అమాంతం 8.7 శాతానికి పెరిగింది (ఆర్‌బి‌ఐ).  దాదాపు రెట్టింపు అయిందన్నమాట!

రీ షెడ్యూల్ చేసిన రుణాలు, వాయిదా వేసిన రుణాలు కూడా కలిపితే మొత్తం బాకిల్లో మొండి బాకీలు, ఈ యేడు జూన్ చివరి నాటికి, 12 శాతంగా తేలాయి.

ఈ సంక్షోభం నుండి భారతీయ బ్యాంకులు బైట పడుతున్నాయని మూడిస్ ‘సర్టిఫికేట్’ ఇచ్చింది. బ్యాంకుల రేటింగ్ ని ‘నెగిటివ్’ నుండి ‘స్టేబుల్’ కి మార్చినట్లు ప్రకటించింది. ఈ రేటింగు వచ్చే 12 నుండి 18 నెలల దాకా ఉంటుందని హామీ ఇచ్చింది.

ఈ కాలంలో మొండి బాకీల పరిణామం పెరగడం కొనసాగినప్పటికీ, పెరుగుదల రేటు గతం కంటే తక్కువ ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అందుకే రేటింగ్ ని పెంచింది.

BIS in Switzerland
BIS in Switzerland

బేసెల్ III స్టాండర్డ్ ని చేరుకోవడానికి ఇండియన్ బ్యాంకులు 2019 లోపల మరో 1.2 ట్రిలియన్ రూపాయలు (ట్రిలియన్ = లక్ష కోట్లు) లేదా 18 బిలియన్ డాలర్లు సమీకరించాల్సి ఉంటుందని మూడీస్ తేల్చింది.

బేసెల్ అనేది స్విట్జర్లాండ్ లో ఓ నగరం. ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు బేసెల్ నగరం వద్ద కలుస్తాయి.  ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రమాణాలను నిర్దేశించే ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈ నగరంలోనే ఉన్నది.

2008-09 నాటి ద్రవ్య ఆర్ధిక సంక్షోభం తర్వాత అటువంటి పరిస్ధితి మళ్ళీ రాకుండా ఉండేందుకు అని చెబుతూ ఈ బి‌ఐ‌ఎస్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రమాణాల కలయికని బేసెల్ III గా పిలుస్తారు.
ఈ ప్రమాణాలు సంక్షోభాల నివారణకు అని చెప్పడం పూర్తి వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి అంటే ఈ ప్రమాణాల అసలు లక్ష్యం ప్రపంచ వ్యాపిత ద్రవ్య వనరులను ఒక పద్ధతి ప్రకారం సమీకరించి అంతర్జాతీయ ఫైనాన్స్ కేపిటల్ కు సేవ చేసేదిగా మార్చడం. మూడో ప్రపంచ దేశాల ద్రవ్య వ్యవస్ధలు ఈ తరహా సేవ చేయటానికి వీలు లేకుండా వెనకబడి ఉన్నాయి. తమకు అందుబాటులో ఉండటానికి వీలుగా మూడో ప్రపంచ దేశాల ద్రవ్య మార్కెట్ ను రూపొందించుకోవటానికి పశ్చిమ ఫైనాన్స్ కేపిటల్ బేసెల్ III ప్రమాణాలను రూపొందించింది.

బేసెల్ III ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్ధను మార్చేందుకు మొదట 2015 గడువుగా విధించారు. అది సాధ్యం కాదని 2017 కి జరిపారు. అదీ కుదరదని గ్రహించి మార్చి 2019కి జరిపారు. మూడిస్ చెబుతున్న 2019 మార్చి లక్ష్యం ఈ కోణంలో నుండి చూడాలి.